సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాను భారత్ – పాక్ యుద్ధం రాకుండా ఆపివేశానని ప్రపంచానికి గర్వముగా ప్రకటించిన ట్రంప్ రష్యాను ఉక్రెయిన్ ఫై యుద్ధం చేయడాన్ని కట్టడి చేయలేకపోతున్నారు. విషయానికి వస్తే తన దాయాది, పాశ్చత్య దేశాలకు వంతపాడుతూ వారి కూటమిలో చేరిన ఉక్రెయిన్ ను రష్యా గత 3 ఏళ్ళ పైగా దాడులతో ఆక్రమణ కొనసాగిస్తూనే ఉంది. రష్యా ఉద్దేశ్యం ఉక్రెయిన్ ను 3 దశాబ్దాల క్రితం ఉన్నట్లు గానే రష్యాలో విలీనం చేసుకోవాలని ప్రపంచం అందరికి తెలిసిన విషయం .. అయితే అమెరికా ప్రసిడెంట్ ట్రంప్ కి ఆలస్యంగా తెలసివచ్చింది. చర్చలకు సిద్ధమేనని, కలసి రాజి చేసుకొందామంటూనే..దోబుచులు ఆడుతూ యుద్ధం ఆపేదామంటూనే ఉక్రేన్ భూభాగాలను ప్యూహాత్మకంగా ఆక్రమించుకొంటూ పోతున్న రష్యా గత ఆదివారం భీకర దాడులకు దిగింది. ఉక్రెయిన్‌ సైనిక స్థావరాలు, ఆయుధ డిపోలే లక్ష్యంగా వందలాది మిసైళ్లు, డ్రోన్లను రష్యా ప్రయోగించింది. ఈ దాడిపై అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమం ట్రూత్‌లో స్పందించారు. రష్యా దేశాధ్యక్షుడు పుతిన్.. తనకు మంచి స్నేహితుడని, అయితే ఇటీవల పుతిన్‌ పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నారన్నారు. ఉక్రెయిన్‌లో అమాయక పౌరులను చంపేస్తున్నారని మండిపడ్డారు. అదీకాక ఉక్రెయిన్‌లో కొంత భాగాన్ని పుతిన్ కోరుకోవడం లేదని.. అతడు ఆ దేశం మొత్తాన్ని కోరుకుంటున్నాడని ట్రంప్ ఇన్నాళ్లకు అభిప్రాయ పడ్డారు.. అలా చేస్తే రష్యా పతనం అవుతుందని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *