సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం (మే 26న) భారత స్టాక్ మార్కెట్లు (Stock Market) సూచీలు లాభాల బాటలో దూసుకొనిపోతూ ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉదయం 10.20 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 678 పాయింట్లకు పైగా పెరిగి 82,405.95 స్థాయికి చేరుకోగా, నిఫ్టీ 50 కూడా 202 పాయింట్లు లాభపడి 25,055కి చేరుకుంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 354 పాయింట్లు వృద్ధి చెందగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 414 పాయింట్లు పెరిగింది. ఈ నేపథ్యంలో మార్కెట్ కొన్ని నిమిషాల వ్యవధిలోనే భారీ లాభాల దిశగా దూసుకెళ్లగా, ఇన్వెస్టర్లు లక్షల కోట్ల రూపాయలను దక్కించుకున్నారు. ఇదే సమయంలో హిందాల్కో, టాటా మోటార్స్, M&M, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. ఇండెక్స్‌లో అధిక ప్రాధాన్యత కలిగిన ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు పెరగడంతో మార్కెట్ ఊపందుకుంది.
