సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నోరు, అధికారం ఉంది కదాని.. ‘ఎవరి గురించి అయినా మాటలు హద్దులులో ఉండాలి అంటారు’.. అలాగే కక్ష సాధింపులకు ఒక హద్దు ఉంటుంది.. మరి ఎన్ని కేసులలో కోర్ట్ బెయిల్ లు వస్తున్నా మరల పడుతున్న కొత్త కేసులలో 3నెలలు పైగా రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఊపిరి పిలుచుకోవడం కష్టంగా ఉందని, తరుచు వాంతులు అవుతుండటంతో కోర్టుకు వచ్చిన సమయాల్లో కూడా వంశీ ఎంతో నీరసంగా మొత్తం రూపం మారిపోయారు. జైల్లో ఎదో జరుగుతుందని , ఆరోగ్యం బాగోలేదని చెపుతున్న పట్టించుకోవడం లేదని 115 కేజీల మనిషి 90 కేజీలకు తగ్గిపోయారని ఆయన భార్య వాపోతున్నారు.అయితే చాలా రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలు మరింత తీవ్రం కావడంతో జైలు అధికారులు.. ఇక విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి లాభం లేదని, నేడు, సోమవారం గుంటూరు జీజీహెచ్‌కు తీసుకువచ్చారు. దీనితో వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయ్. మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవల మీడియా తో మాట్లాడుతూ.. ప్రభుత్వ కక్ష పూరిత చర్యలతో ఒకవేళ వంశీ జైలు లోనే చనిపోతే రాష్ట్రము మాములుగా ఉండదని సీఎం చంద్రబాబు పతనం అక్కడి నుండే ప్రారంభం అవుతుందని ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చెయ్యడం జరిగింది.
