సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వినూత్న కధనాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున – ధనుష్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘కుబేర’. ఈ సినిమాలో రష్మిక మందన్న కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాలోని ప్రధాన పాత్రలో నాగార్జున,హీరోగా ధనుష్, రష్మిక పాత్రలకు సంబంధించిన పోస్టర్లు మరియు గ్లింప్స్ ను ఇటీవల విడుదల చేయగా మంచి బజ్ క్రీయేట్ అయ్యింది. తాజాగా, ‘కుబేర’ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ లో వచ్చిన పాట చుస్తే చాలు కధాగమనం ప్రేక్షకులకు అర్ధం అయ్యిపోయే విధంగా ఉంది. డబ్బు కోసం మనిషి స్వార్ధం కుబేరుడి లాంటి హీరో ధనుష్ ను పేదవాడిగా మార్చేస్తే మిస్టరీలు, కుట్రలు ఛేదించి అతనిని తిరిగి కుబేరుడిగా మార్చే అధికారి పాత్రలో నాగార్జున కనిపిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు మరియు తమిళ భాషల్లో జూన్ 20న థియేటర్లలోకి రానుంది.
