సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిర్వహణ కష్టంగా ఉందని, ఎన్నో ఎన్నో వందల థియేటర్స్ మూసేసారు. పెద్ద హీరోల సినిమాలు తగ్గిపోయాయని, OTT దెబ్బకు ప్రేక్షకులు లేక థియేటర్స్ ఖాళీ గా ఉంటున్నాయని, ఒక వేళా పెద్ద సినిమాలు వచ్చిన వాటికీ కూడా కేవలం కొద్దీ రెంట్ ఇస్తునారనీ .. అదే పెద్ద సినిమాలు మల్టి ఫ్లెక్స్ తరహాలో కలెక్షన్స్ లో సింగిల్ థియేటర్స్ కు పెర్సెంటేజ్ ఇవ్వాలని లేని పక్షంలో నిరవధిక థియేటర్స్ బంద్ చేస్తామని నిర్వాహకులు హెచ్చరించిన నేపథ్యంలో .. పవన్ కళ్యాణ్ ‘ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కు ఇబ్బంది కలిగించడానికి కొందరు సినీ పెద్దలు కుట్ర తో మొదలు పెట్టారని భావించిన ఏపీ డెప్యూటీ సీఎం పవన్ తీవ్ర ఆగ్రహం తో ఉన్నారు. తమ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా సినీ పెద్దలు ఎవ్వరు సీఎం చంద్రబాబు ను మర్యాదపూర్వకంగా కూడా కలవలేదని , రిటన్ గిప్ట్ ఇచ్చిన వారి అహాన్ని దించేస్తానని హెచ్చరించారు. ఈ కుట్రలో జనసేన పార్టీ నేతలు కూడా ఉన్నారని భావించిన నేపథ్యంలో రాజమండ్రి జనసేన ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి అత్తి సత్యనారాయణను పార్టీ సభ్యత్వాన్ని కూడా తొలగించింది. థియేటర్ల బంద్‌కు సంబంధించి మంత్రి కందుల దుర్గేష్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో.. అధికారులు విచారణ చేపట్టగా.. ఈ వ్యవహారంలో సత్యనారాయణ పాత్ర ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. అంతే కాకుండా థియేటర్ల బంద్ అంశం తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రారంభమైందని, అక్కడి నుంచే తెలంగాణకు ఆపాదించారంటూ.. తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ థియేటర్స్ లీజు తీసుకొన్న దిల్ రాజు కూడా ప్రకటించారు. ఇదిలా ఉండగా నేడు,మంగళవారం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఏపీ థియేటర్స్ లో ఇకపై కొత్త సినిమాల టికెట్స్ రేట్లు పెంచాలంటే నా సినిమాలతో సహా ఒక ప్రభుత్వ కమిటీ నిర్ధారిస్తుంది ( గత వైసీపీ ప్రభుత్వ తరహాలోనే) అని అలాగే థియేటర్స్ క్యాంటీన్ లలో ఆహార శుభ్రత, పార్కింగ్ వాహనాలపై అధిక ధరలపై అధికారులు నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిజానికి థియేటర్స్ కి సినిమా రెంట్ కన్నా అసలు ఆదాయం అవే కావడం ఇక్కడ గమనార్హం.
