సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం సుంకర పద్దయ్య వీధిలోని 25 అడుగుల శ్రీఅభయ ఆంజనేయస్వామి దేవస్థానంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి జయంతి వేడుకలు ముగింపుగా నేడు, మంగళవారం స్వామివారికి మహా నివేదన, భక్తులకు అన్న సమారాధనను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు ఎమ్మెల్యే అంజిబాబు స్వామివారిని దర్శించుకుని మహా నివేదనకు హారతులు ఇచ్చి అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేలాది మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ముచ్చకర్ల శివ, లంకి చిన్ని, ముచ్చకర్ల సుబ్బారావు, వబిలిశెట్టి రామకృష్ణ, గనిరెడ్డి త్రినాథ్, కారుమూరి సత్యనారాయణ మూర్తి, భూషణం, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
