సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నేటి బుధవారం ఉదయం, ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి రఘురామా కృష్ణంరాజు స్వర్గీయ ఎన్టీఆర్ సమాధిపై పుష్పాలు సమర్పించి ఘన నివాళ్లు అర్పించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. తన అభిమాన సినీ హీరో NTR, యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానాయకుడు, దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ను తెలుగు జాతి ఉన్నంత వరకు మరువలేని చరిత్ర సృష్టించారని , పేద ప్రజలకు అయన చేసిన సంక్షేమ పధకాలు దేశానికే ఇప్పటికి మార్గదర్శకాలు అయ్యాయని అన్నారు. ఆయన తెలుగు ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు.
