సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మానవాళి ఆరోగ్యానికి ఎంతో హానికరం అయిన పొగాకుకు వ్యతిరేకంగా ఏటా మే 31 తారికున ప్రపంచ ధూమ పాన వ్యతిరేక దినం (World No Tobacco Day) ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు, శనివారం భీమవరంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పొగాకు ఉత్పత్తులు ద్వేషించే వారు అంత ప్లకార్డులు పట్టుకొని రోడ్లు పైకి వచ్చి ధూమ పాననికి వ్యతేరేకంగా నినాదాలు చేస్తారు. ప్రతి ఏడాది మన దేశంలో పది లక్షల మంది ఈ దుర అలవాట్లు వల్ల చనిపోతున్నారు. ప్రతి రోజు 2,200 మంది చనిపోతున్నారు. పొగాకు వాడకం ద్వార వచ్చే రోగాలు నోటి కేన్సేర్, కాలేయం కేన్సేర్, ఉపిరితిత్తుల కేన్సేర్, గుండె సంబదిత వ్యాధులు,మగవారిలో నపుంసకత్వం ఆడవారిలో గర్భస్థ కాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పొగాకు మరియు మద్యం సేవించడం మానాలి అనుకుంటున్నా వారికి కార్పొరేట్ హాస్పిటల్ స్థాయి లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు ఉచిత సేవలు అందుతాయి, టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-2024 కి కాల్ చేస్తే ఉచిత టెలి కౌన్సిలింగ్ సేవలు కూడా అందుతాయి, ఈ కార్యక్రమం జిల్లా వైద్య మరియుజిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి, డా. గీతాబాయి పర్యవేక్షణలో జిల్లా ఎయిడ్స్ నివారణ అధికారి డాక్టర్ గోవిందా బాబు, డాక్టర్ ధనలక్ష్మి , డాక్టర్ మాధవి కళ్యాణి డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ జి సుభాష్ డాక్టర్ రాంబాబు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
