సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏడాది గడుస్తున్నా .. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చ కుండా చంద్రబాబు సీఎంగా అధికారంలోకి వచ్చిన కూటమికి ప్రజా నిరసనగా ఈ నెల 4వ తేదీన ‘ వెన్నుపోటు దినం’ పెద్ద ఎత్తున నిర్వహించాలని పశ్చిమ గోదావరి వైసీపీ నేతల సమావేశంలో భీమవరం శివారులోని (పెద్ద మిరం) వైసీపీ కార్యాలయంలో వైసీపీ జిల్లా అడ్జక్షుడు ముదునూరి ప్రసాదరాజు,మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు, తదితర నేతలు పిలుపు నిచ్చి ‘ వెన్ను పోటు దినం’ పోస్టర్ ను విడుదల చేసారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత వైసీపీ పాలనలో పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమ పధకాలు అమలు చేశామని, పేకాట జూదం క్లబ్ లను నిషేధించి ప్రజలను వ్యసనాల నుండి అదుపులో ఉంచామని, మరి కూటమి పాలన వచ్చాక పేకాట క్లబ్ ల నిర్వహణకు భీమవరంలో పర్మిషన్స్ లు ఇచ్చారని, ఒకప్పుడు గోవా, నేపాల్, శ్రీలంక వెళ్లి పేకాట ఆడుకొనేవారు మరి ఇప్పుడు వారందరికీ భీమవరమే పేకాట క్లబ్ లకు నిలయంగా మారిపోయింది అని ఆరోపించారు.
