సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ‘రాష్ట్రీయ కృషి వికాస్ యోజన” పథకం క్రింద కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీతో ఉండి నియోకవర్గానికి మంజూరైన 11 “కిసాన్ డ్రోన్ల”ను గత ఆదివారం సాయంత్రం పాలకోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని రైతాంగ లబ్దిదారులకు శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు అందజేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఉండి నియోజకవర్గానికి ఈ డ్రోన్లను మంజూరయ్యాయని, వీటిని ఉపయోగించేందుకు కొంతమంది ఔత్సాహికులకు పైలట్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని రఘురామకృష్ణ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాతో పాటు జిల్లా కలెక్టర్ సి. నాగరాణి , వ్యవసాయ శాఖ అధికారులు, కొత్త పల్లి నాగరాజు మరియు కూటమి నాయకులు రైతులు పాల్గొన్నారు.
