సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవన్ అభిమానులుకు మరోసారి నిరాశ ఎదురయింది. ఇప్పటికే రిలీజ్ లు అనేక సారులు వాయిదా పడిన పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 12న రిలీజ్ కావడం లేదని , సోషల్ మీడియాలో సినిమాకి వ్యతిరేకంగా వస్తున్నా వార్తలను నమ్మవద్దని నిర్మాతలు నేడు, శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. అయితే హరిహర వీరమల్లు ఏ ముహుర్తాన్న ప్రారంభించారో కానీ… గత ఏళ్లుగా.. వీలుకుదిరినప్పుడల్లా సుదీర్ఘ కాలం నత్తనడక గా షూటింగ్ జరుపుకొని, ఏది కలసిరాకపోవడంతో 3న్నర ఏళ్ళు తరువాత దర్శకుడు క్రిష్ బయటకు వెళ్లిపోయారు ( ఇదే దర్శకుడు గతంలో బాలకృష్ణ 100వ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి కేవలం 50 కోట్లతో 3 దేశాలు లో యుద్ధ సన్నివేశాలుతో సహా తీసి కేవలం 70 రోజులలో షూటింగ్ వేగంగా పూర్తీ చేసారు.) ఏది ఏమైనా జూన్ 12న రిలీజ్ చేస్తున్నామని ప్రకటించిన ఈ సినిమా ను ఫ్యాన్సీ రేటుకు కొనడానికి డిస్ట్రిబ్యూటర్స్ ఆసక్తి గా లేరని, విదేశాలలో థియేటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్ లు తెరచిన ఆశాజనకంగా లేవని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానితో నిర్మాతలు కాస్త లేటు అయిన పవన్ తో మరిన్ని హైలైట్ దృశ్యాలు చిత్రీకరించాలని భావిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్..
