సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ లో కూటమి ప్రభుత్వం తమను మోసం చేస్తుందని, చాప క్రింద నీరులా ఉక్కు పరిశ్రమను ప్రవేటీ కరణ చేస్తుందని అందుకే వేలాది కార్మికులను విధుల నుండి తొలగిస్తున్నారని కార్మిక సంఘాలు సమ్మెలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో .. నేడు శనివారం విశాఖలో స్థానిక ఎంపీ మతుకుమిల్లి భరత్ మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్, కార్మికులను తొలగించింది వాస్తవమేనని.. ప్లాంట్ ను లాభాల బాటలో నడపడానికి అవసరమైన మేరకు కార్మికులను విధుల్లో ఉంచి మిగతా వారిని తొలగిస్తున్నారని ప్రకటించారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని(World Yoga Day) విశాఖపట్నంలో ఘనంగా నిర్వహిస్తున్నామని ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. విశాఖపట్నంలో జరిగే యోగా కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరవుతున్నారని చెప్పారు. విశాఖలో నిర్వహించే యోగాకు ప్రపంచ రికార్డ్ కోసం సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.
