సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో బిజినెస్, పారిశ్రామిక రంగంలో ఉత్పాదకత పెండచం కోసం రోజులో గరిష్ట పని గంటలు 9 నుంచి 10కి పెంచారు. ఇకపై ఏపీలో కార్మికులు రోజుకు 9 గంటలు కాదు.. 10గంటలు పని చేయాల్సి ఉంటుంది. కార్మికులు, పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండేలా కార్మిక చట్టాలను సవరించాలని నిర్ణయించినట్లు ఐ అండ్ పిఆర్ మంత్రి కె. పార్థసారథి తెలిపారు. రోజుకు గరిష్టంగా 10 గంటల పని చేయోచ్చనే విధంగా కొత్త కార్మిక చట్టాలను తయారు చేశారు. లేబర్ యాక్ట్‌లోని.. సెక్షన్ 55 ప్రకారం 5 గంటల పనికి ఒక గంట విశ్రాంతి ఉండేది. దానిని ఇప్పుడు ఆరు గంటలకు మార్చారు. దీనిపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని అన్నారు.
