సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన అధినేత , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో మాజీ టీడీపీ ఎమ్మెల్యే వర్మ నేడు, శనివారం స్థానిక జనసేన నేతలను పరోక్షంగా ఇరుకున పెడుతూ.. ఇసుక మాఫియాను ఉద్దేశించి పరోక్షంగా , స్థానిక పోలీస్ లను కలపి భారీ ఇసుక కుంభకోణం ఫై సంచలన ఆరోపణలు చేసారు. అంతే కాదు ఆయన స్వయంగా మల్లివారి తోటకు వెళ్లి ఇసుక అక్రమ త్రవ్వకాలు జరుగుతున్న ప్రదేశానికి టీడీపీ నేతలతో కలసి పరిశీలించారు. వర్మ మాట్లాడుతూ.. ఇక్కడ పోలీసులు కు రాత్రి అయితే రే చీకటి వస్తుంది. ఇసుక మాఫియా తో కుమ్మక్కు అయ్యిపోయినట్లు ఉన్నారు. రోజుకు 200 నుండి 300 లారీల ఇసుక అక్రమంగా మాఫియ గాళ్ళు తోలుకుపోతున్న పోలీసులు మామూళ్లు తీసుకోని చూస్తూ ఉరుకొంటున్నారు. దీని వెనుక పెద్దలఫై చర్యలు తీసుకోరా? గత 20 రోజులుగా మేము ఇసుక తోలుకొని పోతున్న వారిఫై పిర్యాదు చేస్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదు అని వాపోయారు. ఇప్పుడు కొత్తగా రమణక్క పేటలో కూడా ఇసుక దోచుకోవడానికి శంకుస్థాపన చేసారు అని విమర్శించారు.
