సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాపు నాడు ఉద్యమనేత, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada ) తాజగా నేడు, సోమవారం ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. తన కుమార్తె క్రాంతి( జనసేన) ప్రవర్తనపై, ఆమెను అడ్డుపెట్టుకొని తన రాజకీయాలకు దూరం చెయ్యడానికి అధికారంలో ఉన్నవారు కుట్ర చేస్తున్నారని ఆయన విమర్శలు చేశారు. ముద్రగడ లేఖలో.. గత ఏడాదిగా మనస్పర్దలతో నా కూతురు కుటుంబం జోలికి నేను నా కుటుంబ సభ్యులు వెళ్లకపోయినా నన్ను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. నా కూతురు అల్లుడు కుటుంబం రగలిపోతోందని అన్నారు. నిజమే నాకు క్యాన్సర్ వచ్చింది. నా చిన్న కొడుకు తీసుకొన్న జాగ్రత్తల వల్ల చక్కగా వైద్య చికిత్స పొంది కోలుకొన్నాను. అయితే తనకు క్యాన్సర్ వచ్చినా చిన్న కొడుకు పట్టించుకోవడం లేదని బాధాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని.. నిజానికి గతంలో నా కూతురు మామగారు కి కాన్సర్ వస్తే నేనే రాజమండ్రిలో ఉండి 15 రోజులు సేవలు చేసానని, అయితే నా భార్యకు గతంలో కాన్సర్ వస్తే వారింటికి వెళ్తే 5 నిముషాలు కూడా నా కూతురు అల్లుడు పట్టించుకోలేదు. మరి ఇప్పుడు నాపై ఎందుకు ప్రేమ చూపిస్తున్నారని? ఇక ఈ జన్మకు వారిని కలిసేదే లేదని.. తన కుమారుడు గిరిబాబుకు మంచి రాజకీయ భవిషత్తు ఉందని అతనిని నాకు దూరం దూరం చేస్తే వారి అడుగులకు మడుగులోత్తుతానని అనుకుంటున్నారని.. వీళ్ల వేధింపులకు బయపడి రాజకీయాలను వదిలే ప్రసక్తే లేదని, అది ఈ జన్మకు జరగదని ముద్రగడ అన్నారు. నా కూతురు ను నాపై ప్రేరేపిస్తున్న వారు దమ్ము ఉంటే మీరు గతంలో హామీ ఇచ్చిన కాపు రిజర్వేషన్లు అమలు చెయ్యాలని, ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయించి తరువాత మీ డబ్బా కొట్టుకోవాలని ముద్రగడ సూచించారు.
