సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సోమవారం లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. నేడు, మంగళవారం సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్‌గా ట్రేడ్ అయ్యాయి. గత సోమవారం ముగింపు (82, 445)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 200 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభనష్టాలతో దోబూచులాడింది. 82, 240-82,680 శ్రేణి మధ్యలో కదలాడింది. చివరకు సెన్సెక్స్ 53 పాయింట్ల నష్టంతో 82, 391 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 1.05 పాయింట్ లాభంతో 25, 104 వద్ద రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం భారీగా నష్టపోయింది.సెన్సెక్స్‌లో గ్రాసిమ్, ఓరాకిల్ ఫిన్‌సర్వ్, బ్లూస్టార్, ఆదానీ టోటల్ గ్యాస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ 210 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.60గా ఉంది.
