సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తీ అయ్యిన సందర్భంగా ఈనెల 12న రాజధాని అమరావతిలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. గత ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలు వివరించనున్నారు. అలాగే వచ్చే నాలుగేళ్లలో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు, ప్రజా సంక్షేమ పదకాలు ఫలితాలు గురించి ప్రజలకు వివరించేందుకు వచ్చే నాలుగేళ్ల పాలనకు సంబంధించి డ్రాఫ్ట్‌ను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల క్యాడర్ పాల్గొనేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
