సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మొత్తానికి నైరుతి రుతు పవనాలతో కదలిక వచ్చిన నేపథ్యం మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా తీరాన్ని అనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో గత 2 రోజులుగా వాతావరణం చల్లబడింది. చెదురుమదురుగా వర్షాలు కూడా పడుతున్నాయి. వీటి ప్రభావంతో రానున్న ఐదు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న 24 గంటల్లో ఒక మోస్తారు వర్షాలతోపాటు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే ఆవకాశం ఉందని తెలిపింది.ఈ నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ , జిల్లాలకు ఆరెంజ్ ఆలర్ట్.. అలాగే బాపట్ల, కృష్ణ, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అయితే కృష్ణాజిల్లాలోని గుడివాడ పట్టణంలో అత్యధికంగా 11సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. అలాగే కైకలూరు, మచిలీపట్నం 7, ఏలూరు 6, నూజివీడు, భీమడోలు, రేపల్లెలలో 5 సెంటీమీటర్లు, లేపాక్షిలో 4 సెంటీమీట్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
