సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వెన్నెల..ప్రస్థానం ఫేమ్.. వినూత్న సినిమాల ప్రముఖ దర్శకుడు దేవాకట్టా మయసభ (Mayasabha) అనే సంచలన రాజకీయ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ను త్వరలో సోని లీవ్ ఓటీటీలో తెలుగుతో పాటు ఇతర భాషల్లో స్ట్రీమింగ్‌కు తీసుకు వస్తున్నట్లు సమాచారం. తెలుగు రాజకీయాల్లో ఒకనాటి స్నేహితులు తరువాత రాజకీయ విరోధులుగా మారిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Y. S. Rajasekhara Reddy), ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) జీవితాల చుట్టూ ఈ వెబ్ సిరీస్ రూపొందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆది పినిశెట్టి , చైతన్య రావు చంద్రబాబు , రాజశేఖర్ రెడ్డిలుగా లీడ్ రోల్స్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ సిరీస్‌ను రెండు మూడు సీజన్లుగా రూపొందించాలని చూస్తుండగా మయసభ మొదటి సీజన్‌ను ఈ ఏడాది అక్టోబర్ లో ఓటిటి లోకి వస్తుందని భావిస్తున్నారు. అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.
