సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం లో అందరు మంటలలో బుగ్గి అయ్యారు విమానం లో మొత్తం 242 మంది ప్రాణాలు కోల్పోయారు.అనుకొన్నారు. అయితే ఇంత విషాదంలోనూ ఒక్కరు రమేష్ విశ్వాస్ మాత్రం ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయపడి నడుచుకొంటూ బయటకు వచ్చి తన ఆయువు గట్టిదని మృత్యుంజయుడుగా నిలిచారు. హాస్పటల్ లో స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఆయనను ప్రధాని మోడీ నేడు, శుక్రవారం పరామర్శించి అతని భయానక అనుభవాన్ని పంచుకున్నారు.40 ఏళ్ల బ్రిటిష్ పౌరుడు రమేష్ విశ్వాస్ కుమార్ మాట్లాడుతూ .. విమానంలో ఒక్కసారిగా ఆకుపచ్చ ఎరుపు లైట్లు వెలిగి ఆరిపోతున్నాయని ఇంతలో అకస్మాత్తుగా భవంతిలోకి విమానం దూసుకుపోయి పోలిపోయిందని, సెకండ్లలోనే అంతా జరిగిపోయిందని తెలిపారు. తన సీటు సమీపంలో భారీ డ్యామేజ్ జరిగింది. ”మొదట నేను చనిపోయానని అనుకున్నాను.నా చెయ్య కాలిపోతుంది.బాగా ఏడ్చాను. నా పక్కనున్న కిటికీ విమాన ప్రధాన భాగం తెరుచుకోవడంతో పాకుకుంటూ బయటపడ్డాను. నా చుట్టూ ఉన్న వారు చనిపోవడమో, చావుకు చేరువలో ఉండటమో కనిపించింది’ అని చెప్పారు. విమానం నుంచి బయటపడగానే ‘విమానం పేలిపోయింది‘ అంటూ అరుస్తూ ఆయన బయటకు రావడం వీడియో ఫుటేజ్‌లో కనిపిస్తోంది. అయితే విమానం పడిన వైద్య కళాశాల హాస్టల్ లో భోజనం చేస్తున్న సుమారు 25 మంది విద్యార్థులు చనిపోవడం అనేకులు గాయపడటం వారి కుటుంబాలలో అనుకోని విషాదాల పరంపర కొనసాగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *