సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ రాజధాని అమరావతి (Amaravati) మహిళల పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసు ఫై సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు (Kommineni ) అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో ఆయన బెయిల్ కోసం సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. కింది కోర్టులో బెయిల్ కోసం కొమ్మినేని దరఖాస్తు చేసుకున్నారు. అయితే అక్కడ ఆయన బెయిల్ పిటీషన్ పెండింగ్‌లో ఉండగానే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై నేడు శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ పీకే మిశ్రా ధర్మాసనం బెయిల్ మంజూరు చేస్తూ.. వెంటనే, సీనియర్ జర్నలిస్ట్, కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలని ఆదేశాలిస్తూ.. అమరావతిపై అసభ్యకర వ్యాఖ్యలు కొమ్మినేని చెయ్యలేదని కేవలం ఒక విశ్లేషకుడు మాటలకూ నవ్వారని, దానికే హోస్ట్ మీద కేసు ఎలా నమోదు చేస్తారని? సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. ఆలా అయితే కొన్ని కేసులు విచారణ జరుగుతున్నపుడు జడ్జి లు కూడా నవ్వుతారని వ్యాఖ్యానించారు. ప్రజా స్వామ్యాన్ని వాక్ స్వాతంత్య్రాన్ని రక్షించాలని ఏపీ పోలీసులకు ఆదేశిస్తూ .. న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం స్పష్టం చేసింది. కొమ్మినేని ఫై మొదట పెట్టిన ఎస్ సి ఎస్టీ కేసును ఎలా పెడతారని మంగళగిరి కోర్ట్ ఆ కేసు తొలగించి పోలీసులకు చివాట్లు పెట్టడం గమనార్హం.
