సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే, రఘురామా కృష్ణంరాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రేపటి నుండి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భముగా ప్రజలు ఆరోగ్యం కోసం ఆకివీడు పతంజలి కేంద్రం ద్వారా రేపు పెదమిరం, స్థానిక రాధాకృష్ణ పంక్షన్ హాలులో ప్రారంభించి 10 రోజులు ఉచిత యోగ క్లాస్ లు నిర్వహిస్తున్నామని యోగ మాస్టర్ మరియు కొత్తపల్లి నాగరాజు తో కలసి పోస్టర్ విడుదల చేసారు. తదుపరి రఘురామా మాట్లాడుతూ.. ముందుగా అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో మృతి చెందిన వారికి, ఎంతో భవిషత్తు ఉన్న వైద్య కళాశాల విద్యార్థులులకు నివాళులు వారి కుటుంబ సబ్యులకు సంతాపం తెలుపుతున్నానని అన్నారు. ఇక రాష్ట్రంలో సుపరిపాలనకు తొలి అడుగు పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా గడచిన ఈ సంవత్సర కాలంగా తన ఉండి నియోజకవర్గాన్నిరాష్ట్ర ప్రభుత్వ నిధులపై ఆధార పడకుండా స్థానికుల సహకారంతో దాతల దాతృత్వంతో అభివృద్ధి పథంలో నిలిపేందుకు సంతోషంగా ఉందని అన్నారు. నియోజకవర్గంన్ని నా ఇల్లు గా ప్రజలను కుటుంబంగా భావించానని అందుకే కొందరికి ఇబ్బంది పెట్టిన ఎక్కువ మందికి ఆరోగ్యం అభివృద్ధి ని కలిగించానని పేర్కొన్నారు. ముఖ్యంగా పంటలకు కాల్వగట్ల ఆక్రమణలు తొలగించి, ఆక్వా చెరువుల కలుషిత నీరు కలవకుండా అరికట్టి , ప్రజలకు మంచినీటి సౌకర్యాలను రైతులకు నీటి పారుదల సౌకర్యాలను మెరుగుపరిచనాన్ని అన్నారు. ఆక్రమణ దారుల తరపున ఎవరు అడ్డంకులు కలిగించిన ఉపేక్షించమని, ఎవరు కేసులు వేసిన సుప్రీం కోర్ట్ గత తీర్పు ప్రకారం ఆ కేసులు నిలబడవని అన్నారు. ఇటీవల నియోజకవర్గం అంతా దాతల సహకారంతో కోట్లాది రూపాయల ఖర్చుతో సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని ఇక క్రైమ్ లు గంజాయి బాచ్ ల ఆగడాలు అదుపులో పెడతామని హెచ్చరించారు.ఎక్కడ 6సెంట్ల ఖాళీ స్థలం ఉన్న మొక్కలు నాటి పార్కులు అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రజలు శ్రేయస్సు కోసం తన లక్ష్యాలు అర్ధం చేసుకొని సహకరిస్తున్న మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
