సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఆమిరంలో ( భీమవరం శివారులోని) రాధా కృష్ణ పంక్షన్ హాలులో యోగాంధ్ర 2025 కార్యక్రమం నిర్వహించారు. యోగా కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్, రఘురామా జిల్లా కలెక్టర్ నాగరాణి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా రఘురామ మాట్లడుతూ.. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే యోగాంధ్ర కార్యక్రమం ఏపీ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో పెద్ద ఎత్తున నెలరోజుల పాటు యోగా శిక్షణ నిర్వహిస్తున్నారన్నారు. ఈనెల 21న వైజాగ్ సముద్రం ఒడ్డున ప్రపంచ స్థాయిలోనే నిలిచిపోయేలాగా ప్రధాని మోడీ రాకతో భారీ యోగ కార్యక్రమం జరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా యోగాకు రెండు కోట్ల 20 లక్షల మంది రిజిస్టర్ అయ్యారన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 8,50,000 మంది యోగా రిజిస్టర్ చేసుకున్నారని చెప్పారు. భారతదేశంలోనే యోగా అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తొచ్చేలాగా యోగాంధ్ర 2025ని విజయవంతం చేయాలని రఘురామ కృష్ణంరాజు పిలుపు నిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *