సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల భారత్ తో యుద్ధ సమయంలో పాకిస్తాన్ కు బహిరంగంగా సహకరించిన టూర్కియా దేశానికీ సరిహద్దు శత్రు దేశం, భారత్ కు మిత్ర దేశం సైప్రస్ (Cyprus) పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ 3’ (Grand Cross of the Order of Makarios III)ను ప్రధానం చేశారు. ప్రధాని ఈ గౌరవాన్ని స్వీకరిస్తూ ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహానికి ఈ అవార్డును అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ చేతుల మీదుగా మోదీ ఈ పురస్కారం అందుకున్నారు. రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ తొలి అధ్యక్షుడు మకరియోస్ 3 పేరుతో ఈ అత్యున్నత పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. సైప్రస్ ప్రభుత్వ అవార్డు 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇరుదేశాల సంస్కృతి, సోదర భావనకు ప్రతీక అని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *