సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టాలీవుడ్ ఊహించని స్టార్ వార్స్ జరగనుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan ) నటించి అనేక సార్లు విడుదల వాయిదా పడిన హరిహర వీరమల్లు (Harihara Veeramallu) ఈ జూన్ 12వ తేదీన విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల , ఎన్నో వివాదాల మధ్య మరోమారు వాయిదా వేశారు. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా జూన్ 25వ తేదీ విడుదల కాబోతుందని తెలుస్తుంది. అయితే అదే రోజే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటించిన భారీ సినిమా కింగ్ డం (King Dom)సినిమా విడుదల తేదీ ముందే లాక్ చేసారు. దీనితో ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలకు సిద్ధమవుతున్నాయనే విషయం తెలియడంతో అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. ఇందులో ఎవరిని తప్పుపట్టలేని పరిస్థితి.. ఎందుకంటే ఈ రెండు సినిమాలు కూడా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ఆధారం గా విడుదల తేదీలను ప్రకటించాయని తెలుస్తోంది. డేట్ మారిస్తే అగ్రిమెంట్ ఉల్లంఘన క్రింద భారీగా నష్టపోతారు. వీరమల్లు సినిమా ఓటీటీ హక్కు లను అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) అదేవిధంగా కింగ్ డం సినిమా ఓటీటీ హక్కు లను కొనుగోలు చేసిన నెట్ ఫ్లిక్స్ (Net Flixs)కూడా స్ట్రీమింగ్ డేట్ ను ఇప్పుడే లాక్ చేశారు అని సమాచారం.. మరి ఇప్పుడు కింగ్ డమ్ నిర్మాత నాగ వంశీ పవన్ కళ్యాణ్ సినిమా కోసం కాస్త వెనక్కి తగ్గుతారా? చూడాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *