సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య హోరాహోరీ యుద్ధ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. నేడు, బుధవారం ఉదయం మొదట నష్టాల్లో మొదలైన సూచీలు ఆ తర్వాత లాభాల్లోకి ప్రవేశించాయి. నేటి మధ్యాహనానికి సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. గత మంగళవారం ముగింపు (81, 583)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 200 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లోకి వచ్చింది. ఒక దశలో ఏకంగా 300 పాయింట్లకు పైగా లాభపడి 81, 858 వద్ద గరిష్టాన్ని చేరుకొంది. అయితే మళ్లీ కిందకు దిగి వచ్చింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 54 పాయింట్ల లాభంతో 24, 907 వద్ద రోజును ముగించింది.సెన్సెక్స్‌లో ఇండస్ ఇండ్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, యూనో మిండా, అవెన్యూ సూపర్‌మార్కెట్, మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 118 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 144 పాయింట్ల లాభంతో ఉంది. . డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 86.31గా ఉంది.
