సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇజ్రాయిల్ -ఇరాన్ ఉద్రిక్తతల మధ్య తాజా పరిణామాలతో ఇరాన్ కు మద్దతుగా రష్యా , చైనా కూడా బరిలోకి వస్తామని హెచ్చరించడం తదుపరి ఇరాన్ ఫై అమెరికా దాడి ని మరో 2వారాల వరకు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో నేడు, శుక్రవారం నిఫ్టీ, సెన్సెక్స్ తదితర మార్కెట్ సూచీలు ఒక అద్భుతమైన బ్రేక్‌అవుట్‌ను చూశాయి. నిఫ్టీ ఏకంగా ఇవాళ 319 పాయింట్లు అధికంగా పైకి దూసుకొనిపోయింది. నేటి శుక్రవారం ఉదయం సానుకూల సంకేతాలతో మొదలైన తర్వాత, మార్కెట్ సెషన్ ప్రారంభంలో బాగా పెరిగింది. ఇలాగే కదిలి నిఫ్టీ గరిష్ట స్థాయిల దగ్గర ముగిసింది.మార్కెట్లు ముగిసే సమయానికి, సెన్సెక్స్ 1,046.30 పాయింట్లు లేదా 1.29 శాతం పెరిగి 82,408.17 వద్ద ఉంది. నిఫ్టీ 319.15 పాయింట్లు లేదా 1.29 శాతం పెరిగి 25,112.40 వద్ద స్థిరపడింది. జియో ఫైనాన్షియల్, ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్‌టెల్, భారత్ ఎలక్ట్రానిక్స్, ట్రెంట్ నిఫ్టీలో టాప్ 5 గా అత్యధిక లాభాలను సాధించాయి.
