సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖ పట్నం లో నేడు, శనివారం ఉదయం ప్రధాని మోడీ నేతృత్వంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. .ఈ కార్యక్రమం లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, మంత్రి లోకేష్, కూటమి ప్రజా ప్రతినిధులు నేతలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ సాంప్రదాయ పురాతన వారసత్వంగా వచ్చిన యోగ ఆసనాలతో ప్రజలు ఆరోగ్యం పెంపొందించుకొని అనారోగ్యాలకు దూరంగా ఆనందంగా జీవించాలని ప్రధాని మోడీ పిలుపు నిచ్చారు. ప్రపంచంలోని 118 ఇతర దేశాల్లో కూడా నేడు, యోగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇక, విశాఖపట్నం కేంద్రంగా ఏపీ ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖర్చుతో లక్షల మ్యాట్ లు ఏర్పాటు చేసి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంతో విశాఖపట్నం రామకృష్ణ బీచ్ సందడిగా మారింది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి తీరం వరకు దాదాపు 26 కిలోమీటర్ల పరిధిలో సుమారు 3 లక్షల మంది యోగాసనాలు వేశారు. దీంతో ఈ కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో (yoga Guinness Record) స్థానం దక్కించుకుంది. ఇంతకు ముందు గుజరాత్ లోని సూరత్‌లో 1.5 లక్షల మంది ఒకేసారి యోగాసనాలు వేసి రికార్డ్ ను తాజాగా విశాఖ యోగాంధ్ర కార్యక్రమం దాటేసింది. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు పర్యవేక్షించారు.
