సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మునిసిపాలిటీ కి సుదీర్ఘ కాలం కారణాలు ఏవైనా 2019 నుండి కౌన్సిల్ కు ఎన్నికలు లేకుండానే కాలం గడిచిపోతుంది. ఇక్కడ అంతా ప్రభుత్వ, మునిసిపల్ అధికారులదే కార్యనిర్వాహణ అజమాయిషీ..( అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కూడా పలు సార్లు గత, మునిసిపల్ కమిషనర్స్ అలసత్వంపై విసిగిపోయి నడిరోడ్డు ఫై నిలదీసిన ఘటనలు జరిగాయి) అయితే కరోనా పానమిక్ పీరియడ్ తరువాత నుండి అప్పటి వైసీపీ సర్కార్ హయంలోనే భీమవరం మునిసిపాలిటీ అవినీతిపై ఆరోపణలు రావడంతో విజిలెన్సు దర్యాప్తులు జరగటం జరిగింది. అయితే నివేదికలు బయటకు రాలేదు.అయితే అప్పటి అవినీతి ఆరోపణలు ఫై ప్రస్తుత కూటమి ప్రభుత్వం దూకుడు పెంచింది. తాజగా,, భీమవరం మునిసిపాలిటీలోనే అక్రమాలు జరిగాయంటూ విజిలెన్స్‌ నివేదికలో కరోనా సమయంలో భీమవరం మున్సిపాలిటీ వాహనాలకు రికార్డు స్థాయిలో భారీ డీజిల్‌ వినియోగం జరిగినట్లు గుర్తించారు. ఇతరాత్ర అదనపు ఖర్చులు క్రింద లక్షలాది రూపాయలు దుర్వినియోగం ఫై కూటమి ప్రభుత్వం విజిలెన్సు విచారణలో భాగంగా అప్పటిలో పని చేసిన ఇద్దరు మునిసిపల్ కమిషనర్ లను లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది, మొత్తానికి భీమవరం మున్సిపాలిటీలో అవకతవకలపై తాజా ఉత్తర్వులు సంచలనమ్ రేపుతున్నాయి,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *