సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఊహించని ఎదురుదాడులతో ఇజ్రాయిల్ ని అమెరికా అడ్జక్షుడు ట్రంప్ ను టెంక్షన్ లో పెట్టిన ఇరాన్ దూకుడు కు తోడు రష్యా చైనా కూడా మద్దతుగా అమెరికాను హెచ్చరించడంతో .. ఇక యుద్ధం ఆగిపోవడమో లేక అమెరికా పునరాలోచనతో అగ్ర దేశాలు కూడా నెమ్మదించి ..కేవలం ఇజ్రాయిల్ ఇరాన్ దేశాల దాడులకు పరిమితం కావడమో ? జరుగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. భారత్ కు ఇరాన్ ఇజ్రాయిల్ మిత్ర దేశాలు కావడంతో సంకట పరిస్థితి ఉంది. ఇదిలా ఉండగా.. ఇరాన్ లోని టెహ్రాన్ లో సంభవించిన భూకంపం పలు అనుమానాలకు దారితీసింది. ఉత్తర ఇరాన్‌లోని సెమ్నాన్ ప్రాంతంలో గత రాత్రి రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. అయితే ఈ భూకంపం సంభవించిన ప్రాంతానికి సమీపంలో ఇరాన్ సైన్యం నిర్వహిస్తున్న సెమ్నాన్ అంతరిక్ష కేంద్రం, సెమ్నాన్ క్షిపణి సముదాయం ఉండటంతో, ఇరాన్ రహస్యంగా అణ్వాయుధ పరీక్ష చేపట్టి ఉండవచ్చనే అనుమానాలు బలపడ్డాయి. నేటి శనివారం తెల్లవారుజామున కూడా ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో తమ అణు కార్యక్రమంపై ఎలాంటి చర్చలకు తావులేదని, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ఇరాన్ స్పష్టం చేసింది.
