సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో నేడు, శనివారం స్థానిక ఫంక్షన్ హాల్ లో జరిగిన పశ్చిమ గోదావరి జిల్లా, వైసీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం మరియు భీమవరం నియోజకవర్గ నూతన ఇంచార్జి చినమిల్లి,వెంకటరాయుడి అభినందన సభలో వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ.. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మర్చిపోవడం ఆయన నైజం అని విమర్శించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను దైవ గ్రంథాలుగా భావిస్తారని, ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చారని, తమ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో ప్రజల అందరి చేతులలో డబ్బులు ఆడేవన్నారు, నేటి కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరి దగ్గర డబ్బులు ఉండటం లేదని ఇది అందరి అనుభవం అని అన్నారు.ఆ పథకాలను నిర్వీర్యం చేసారని అన్నారు. ఆరోగ్యశ్రీ ఆగిపోయిందన్నారు. నేడు రాష్ట్రంలో భారత రాజ్యాంగం నడవడం లేదని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం నడుపుతుందన్నారు. విద్యుత్ ఛార్జీలు నిత్యావసర వస్తువులను పెంచి వేసిందన్నారు. వైఎస్ఆర్సిపి తిరిగి అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. చినమిల్లి మాట్లాడుతూ.. గత శుక్రవారం రాత్రి కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి పట్నంలో కడుతున్న బ్యానర్లను అధికారుల చేత తొలగించి వేసిందని ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రభంజనం లాగా ముందుకు వచ్చారని అన్నారు. వెంకట్రాయుడు ను పార్టీ అభిమానులు పూలమాలలతో శాలువాలతో సత్కరించారు.. కార్యక్రమానికి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కామన నాగేశ్వరరావు.ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్,పాలకొల్లు నియోజకవర్గ సమన్వయకర్త గుడాల గోపి, చింతలపూడి సమన్వయకర్త కె.విజయరాజు,కోడే యుగంధర్, కోడే విజయలక్ష్మి,పట్టణ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు, భీమవరం మండల పరిషత్ అధ్యక్షుడు పేరిచర్ల విజయ నరసింహారాజు , నాయకులు పేరిచర్ల సత్యనారాయణ రాజు, ఎస్ రాజు, ఏఎస్ రాజు తోట రామకృష్ణ, మేడిది జాన్సన్ ,తదితరులతో పాటు వందలాది కార్యకర్తలు హాజరు అయ్యారు.
