సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలోని అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పరవాడ మండలంలో స్పీడుగా దూసుకువచ్చిన ఓ లారీ ముగ్గురిని పొట్టన పెట్టుకుంది. ఈ ప్రమాదంలో మరో 16 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. లంకెలపాలెం కూడలి వద్ద నేషనల్ హైవేపై జరిగిన ఈ ప్రమాదంతో స్థానికుల, వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. పరవాడ మండలం లంకెలపాలెం కూడలి వద్ద సిగ్నల్‌ పడింది. దీంతో వాహనాలన్నీ ఆగాయి. అదే సమయంలో గాజువాక నుంచి అనకాపల్లి వైపు ఓ లారీ అతివేగంగా వచ్చి సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న మూడు కార్లు, 10 వరకు బైక్‌ లను ఢీకొడుతూ కొంతదూరం దూసుకుపోయింది. అదే సమయంలో పరవాడ వైపు వెళ్తున్న ఓ కంటెయినర్‌ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లో చనిపోయారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఏడుగురు అనకాపల్లి హాస్పిటల్‌లో, మరో తొమ్మిదిమంది అగనంపూడి హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ పొందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *