సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం స్థానిక పోలీస్ బొమ్మ సెంటర్ లో ఇటీవల కొందరు ఆకతాయిలు నారాయణ స్కూల్ బస్సు లోని విద్యార్థులతో అసభ్య చేష్టలతో ప్రవర్తించిన ఘటన, రోడ్డుపై విద్యార్థి తో బాహాబాహీకి దిగిన ఘటనలు వెక్కిరింపులు వీడియో లు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయిన నేపథ్యంలో ఆ యువకులు ఫై ఇంకా చర్యలు తీసుకోలేదేమిటి అని పోలీస్ వర్గాలపై పెరుగుతున్న వత్తిడి నేపథ్యంలో.. నేడు, మంగళవారం జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ ఆష్మి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆ యువకులు 11 – 12 ఏళ్ళ మైనర్స్ బాలురని అని.. ఆ బాలురని ఎదో ఆకతాయిగా చేసిన పనిగా అసలు ఎడిటింగ్ లేని వీడియోలు చుస్తే అర్ధం అవుతుందని గతంలో ఆ బాలురపై పాత కేసులు కానీ మద్యం తాగి గొడవ చేసిన ఆధారాలు కానీ లేవని, నారాయణ విద్యార్థులను కూడా వివరణ అడిగి తెలుసుకున్నామని, అయినప్పటికీ మైనర్స్ కాబ్బటి వారి చదువు దృష్ట్యా కేసులు పెట్టకుండా వారిని హద్దులలో,క్రమ శిక్షణతో పెంచమని వారి తల్లి తండ్రులను కౌన్సిలింగ్ ఇచ్చామని పేర్కొన్నారు.
