సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ బెట్టింగ్ యాప్ మోసాలు, లోను యాప్ ల మోసాలు, సైబర్ క్రైమ్స్‌పై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని వీటిని అదుపులో పెట్టవలసిన అవసరం ఉందని, దీనిపై వచ్చే అసెంబ్లీ సమావేశంలోప్రధాన చర్చకు తీసుకొనివస్తున్నామని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజు (Raghu Ramakrishna Raju) పేర్కొన్నారు. నేడు,గురువారం ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో రఘు రామకృష్ణమరాజు పిటిషన్ల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. ఇప్పటికే పిటిషన్ కమిటీలో సైబర్ క్రైమ్, బెట్టింగ్ యాప్‌లపై చర్చించామని , అయాచితంగా వచ్చే డబ్బు అంటే చాలామందికి ఉన్న ఆకర్షణతో ఒక ట్రాప్ లో ఇరికించి ఆధునిక. టెక్నాలజీ ద్వారా ప్రజలను సైబర్ నేర గాళ్లు నిండా ముంచేస్తున్నారని అన్నారు. లోన్ యాప్‌లో మొదట రూ.10 వేలు ఇచ్చి.. ఆ తర్వాత రూ.20,000 కట్టాలని వేధిస్తున్నారని అన్నారు. తెలంగాణలో బెట్టింగ్ యాప్‌ల బారిన పడి 960 మంది మరణించారని… ఏపీలో ఎంతమంది నష్టపోయారో తెలియదు, లెక్కలేదని అయితే ప్రతి రోజు సైబర్ క్రైమ్‌కి 700 ఫిర్యాదుల వరకు వస్తున్నాయని చెప్పారు. ఏపీ పోలీసులకు పరుగు పందెంలో మాత్రమే గెలిస్తే సరిపోదని.. ఐటీ నాలెడ్జ్ కూడా అవసరమని, ఎదో వృద్దులు కాలక్షేపం కోసం 5 రూ కు పేకాట ఆడుకొంటే పెట్టె 3 ముక్కలు ఆట కేసులు మానుకొని సైబర్ క్రైమ్ కేసులపై బుర్రకు పదును పెట్టాలని చురకలు అంటించారు. సైబర్ ఫై అవగాహనా ఉన్న పోలిసుల సంఖ్యను పెంచాలని హోమ్ మంత్రికి సూచించారు.
