సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం గుంటూరులో యాంటీ నార్కొటిక్స్ డేలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో గంజాయి సాగుతో దేశాన్ని, ఏపీని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ బ్రాండ్‌ను గత పాలకులు నాశనం చేశారని ఆరోపించారు. డ్రగ్స్, గంజాయిపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో మత విద్వేషాలు కు కుట్ర జరుగుతుందని ప్రజలను రెచ్చగొడితే ఊరుకోమని , రాజకీయం ముసుగులో రౌడీయిజం చేస్తే తోక కట్ చేస్తానని హెచ్చరించారు. ప్రభుత్వ విధానాలకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం.. ఎవరిని వదిలిపెట్టమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రాయలసీమలో ముఠాలను అణచివేసిన పార్టీ టీడీపీ అనిఅన్నారు. ముఠాలు కట్టేవారు మారకపోతే ఏపీలో ఉండే అర్హత లేదని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.
