సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశ్వ విఖ్యాత నటుడు కమల్ హాసన్ కి అరుదైన గౌరవం లభించింది. ఆస్కార్ అవార్డుల సంస్థ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కమిటీలో సినిమా లకు నటీనటులకు కళ సాంకేతిక నిపుణులకు ప్రతిష్టాకర ఆస్కార్ అవార్డుల ఎంపిక లో ఓటింగ్ వేసే సభ్యుడిగా ఆయనకు ఆహ్వానం అందింది. ఇది భారతీయ సినిమా, కమల్ హాసన్ కెరీర్ లో ఒక పెద్ద మైలురాయిగా నిలవనుంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 683 మంది కొత్త సభ్యులను తమ ఓటింగ్ కమిటీలోకి చేరమని అకాడమీ ఆహ్వానించింది. భారతదేశం నుంచి కమల్ హాసన్‌తో పాటు మరికొందరికి కూడా ఈ ఆహ్వానం అందింది. బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, పాయల్ కపాడియాకు కూడా ఈ గౌరవం దక్కింది. గతంలో ఆస్కార్ అవార్డు కోసం కమల్ హాసన్ నటించిన 7 సినిమాలు అక్కడ విదేశీ సినిమాలతో పోటీ పడ్డాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం కమల్ ఇండియన్ 3, కల్కి పార్ట్ 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. తమిళ నాడు నుండి అధికార డి ఎం కే పార్టీ ఇటీవల రాజ్యసభ సభ్యునిగా కమల్ హాసన్ ను ప్రతిపాదించిన విషయం అందరికి విదితమే..
