సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిన తరువాత రాష్ట్రంలోని రైతాంగం ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రధాని కిసాన్ పధకానికి రాష్ట్రము అన్నదాత సుఖీభవ పథకం జోడించి అమలు చేస్తానని సూపర్ సిక్స్ హామీలలో ఒకటిగా అమలు చేస్తానన్న హామీని ఈ ఏడాది లోనైనా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈసారి వాయిదాలు వెయ్యకుండా అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెల 30వ తేదీ లోపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 47.77 లక్షల మంది అర్హులైన రైతు కుటుంబాల ఖాతాల్లో నిధులు జమ చేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది అని సమాచారం. వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు ప్రకారం ‘అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్’ పథకం కింద అర్హత కలిగిన రైతులను గ్రామ/వార్డు సచివాలయాల సర్వే ఆధారంగా గుర్తించామన్నారు. ఇప్పటివరకు 98% మంది రైతులు ఈకేవైసీ పూర్తిచేయగా, మిగిలిన 61 వేల మంది రైతులు త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సొంత భూమి కలిగిన డి-పట్టాదారులు, ఎసైన్డ్ భూములు, ఈనాం భూములపై సాగు చేసే రైతులు అర్హులుగా గుర్తించబడినట్టు తెలిపారు.
