సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆపదలో ఉన్న వారిని ఆదుకోనేందుకే సీఎం సహాయ నిధి ఎంతగానో దోహదపడుతోందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నేడు, శనివారం ఉదయం భీమవరం నియోజకవర్గంలోని 32 మంది లబ్ధిదారులకు రూ 23,32,573 ల చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు వారికి అందించి మాట్లాడారు. సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిదని, వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలని, పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
