సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు లావిష్ గా నిర్మించిన సుప్రసిద్ధ యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ హృతిక్ రోషన్(Hrithik Roshan), ఎన్టీఆర్ (Ntr) హీరోలుగా నిర్మించిన తాజా చిత్రం ‘వార్ 2’ (war 2) ఆగస్టు 14న ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయాన్ ముఖర్జీ దర్శకుడు. కియారా అడ్వాణీ కథానాయిక. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. మరో 48 రోజుల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సినిమా విడుదల నేపథ్యంలో చిత్ర బృందం కౌంట్‌డౌన్ మొదలుపెట్టింది. సినిమాలోని ప్రధాన నటీనటుల సరికొత్త పోస్టర్లను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఈ ప్రచార చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్న jr.ఎన్టీఆర్.. ‘‘బెట్ కాస్తున్నా.. ఇలాంటి వార్‌ను మీరెప్పుడూ చూసి ఉండరు. కౌంట్‌డౌన్ మొదలుపెట్టండి’ అని పేర్కొన్నారు.
