సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ఆంధ్ర ప్రదేశ్ గతంలో వివిధ కారణాలతో అదనపు లోడు విద్యుతు వాడుతూ విద్యుతు బకాయిలు చెల్లించని కారణంగా విద్యుత్తూ సరఫరా నిలిపివేసిన విద్యుత్ వినియోగదారుల కోసం ఏపీసీపీడీసీఎల్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 50 శాతం రాయితీతో అదనపు విద్యుత్ లోడ్ తిరిగి క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది. మార్చి ఒకటి నుంచి ఏపీసీపీడీసీఎల్ తమ విద్యుత్ వినియోగదారులకు ఈ అవకాశం కల్పించింది. అయితే ఈ గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. జూన్ 30తో ఈ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అదనపు విద్యుత్ లోడ్ క్రమబద్ధీకరించుకోవాలనుకునే వారు త్వరపడాలని అధికారులు సూచిస్తున్నారు.
