సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ నుండి డీఎస్సీ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులకు ముఖ్య గమనిక.. జులై 1, 2 తేదీల్లో డీఎస్సీ పరీక్షలు రాయనున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను apdsc.apcfss.in వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని విద్యాశాఖ ప్రకటించింది. నిజానికి మెగా డీఎస్సీ 2025 నియామక పరీక్షలు జూన్ 20, 21 తేదీల్లో జరగాల్సి ఉండగా, యోగా దినోత్సవం కారణంగా వాయిదా వేశారు. ఎన్నో అవరోధాలు తరువాత ఈ పరీక్షలను జులై 1, 2 తేదీల్లో నిర్వహించనుండగా, వీటి కోసం కొత్త హాల్ టికెట్లను విడుదల చేశారు. పరీక్ష కేంద్రాలు, తేదీలు అన్ని మారడం వల్ల ప్రతీ ఒక్కరూ కూడా తప్పనిసరిగా కొత్త హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షకు హాజరు కావాలని అధికారులు తెలిపారు.
