సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు పెంపు, అదానీతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను నిరసిస్తూ జులై 5న సిపిఐ పార్టీ చేపట్టిన ఆందోళనలను జయప్రదం చేయాలని సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. నేడు, మంగళవారం ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో జరిగిన సిపిఐ భీమవరం పట్టణ 25 వ మహాసభలో కోనాల ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. మహాసభకు సీపీఐ పట్టణ సమితి సభ్యుడు వై.వి.ఆనంద్ అధ్యక్షత వహించారు. జులై 9న జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు చేపట్టిన దేశ వ్యాప్త కార్మిక సమ్మె లో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని, ఆగష్టు 6, 7 తేదీల్లో ఉండిలో జరుగనున్న సీపీఐ 27వ జిల్లా మహాసభలు విజయవంతం చేయాలనిపిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కలిశెట్టి వెంకట్రావు, సిపిఐ రాష్ట్ర నాయకులు నెక్కంటి సుబ్బారావు, జిల్లా నేతలు సికిలే పుష్పకుమారి చెల్లబోయిన రంగారావు పాల్గొన్నారు.
