సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మీడియాతో మాట్లాడారు. ఏపీ బీజేపీ అడ్జక్షుడుగా కొత్తగా ఎంపికైన పీవీఎన్ మాధవ్‌కు శ్రీనివాస వర్మ శుభాకాంక్షలు తెలిపారు .అతి త్వరలో ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేసేలా పీవీఎన్ మాధవ్ చూడాలని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కోరారు. కింది స్థాయి కార్యకర్తలతో మాట్లాడి..వారి సమస్యలు పరిష్కరించేలా మాధవ్ పని చేయాలని , పీవీఎన్ మాధవ్ తో పాటు ఆయన తండ్రి చలపతిరావు కూడా 1980 నుంచి 1986 వరకు బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి వ్యక్తి అని గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో మిగతా కూటమి నేతలతో సమన్వయం చేస్తూనే.. ఏపీ బీజేపీని మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు. మనం ఐదు శాతం సీట్లు తీసుకోవడం కాదని.. మనమే మరో పార్టీకి సీట్లు ఇచ్చే స్థాయికి స్వంత బలాన్ని పెంచుకునేలా ఎదగాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ బీజేపీ అడ్జక్షుడు గా ఎన్నికయైన రామచంద్రరావు కు కూడా కేంద్ర మంత్రి వర్మ శుభాకాంక్షలు తెలిపారు.
