సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మొత్తం 10 కేసులలో వరుసగా కోర్ట్ బెయిల్ సాధించిన తరువాత మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ Vallabhaneni Vamsi) నేడు, బుధవారం విడుదలయ్యారు. రంగు రూపు మారిపోయి దగ్గుతూ అనారోగ్యంతో 137 రోజులుగా వంశీ జైలులో ఉన్న విషయం తెలిసిందే. నేడు విజయవాడ జైలు నుంచి వంశీ రిలీజ్ అయ్యారు. నకిలీ ఇళ్లపట్టాల కేసులో వంశీకి నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈరోజు మధ్యాహ్నం వంశీ బెయిల్ ఆర్డర్ కాపీలతో విజయవాడ సబ్ జైలుకు ఆయన తరపు న్యాయవాదులు మాజీ మంత్రి పేర్ని నాని, తలశిల రఘురామ్ కూడా సబ్ జైలు దగ్గరకు వచ్చారు. తర్వాత మాజీ ఎమ్మెల్యే వంశీ జైలు నుంచి బయటకు వచ్చారు. కాగా.. మరోవైపు అక్రమ మైనింగ్ కేసులో వంశీకి కోర్ట్ ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణకు రాగ కోర్టు తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.
