సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వరుసగా 3 రోజులుగా స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాలతోనే ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు, గరిష్టాల వద్ద మదుపర్లు అమ్మకాలకు పాల్పడుతుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల కొనసాగాయి. సోమవారం నష్టాలను చవిచూసిన సూచీలు గత మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. నేడు, బుధవారం ఉదయం కాస్త లాభాల బాట పట్టినప్పటికీ మళ్లీ నష్టాల లో ముగిశాయి సెన్సెక్స్ 287 పాయింట్ల నష్టంతో 83, 409 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే నడించింది. చివరకు 88 పాయింట్ల నష్టంతో 24, 453 వద్ద రోజును ముగించింది. మళ్లీ 24, 500 మార్క్ దిగువకు పడిపోయింది.
