సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మునిసిపాలిటీల్లో ఔట్ సోర్సింగ్ టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగులు గత నెల 14 నుంచి సమ్మె చేస్తుండటం తో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. స్థానిక మునిసిపల్ కమిషనర్లు ఉద్యోగులతో రాజీ యత్నాలు ప్రారంభించారు. చర్చలు ఏ క్షణంలోనైనా ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ డిమాండ్స్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సమ్మెను కొనసాగిస్తే ఉద్యోగులకు నోటీసు లు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా చుస్తే భీమవరం మునిసిపాలిటీల్లో 59, తాడేపల్లిగూడెం 83, తణుకు 56, పాలకొల్లు 25, నరసాపురం 55, ఆకివీడు–12 మంది మొత్తం 290 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీరి ప్రధాన డిమాండ్అత్యవసర అన్ని విభాగాల టెక్నికల్ ఉద్యోగులకు రూ.29,200, నాన్ టెక్నికల్‌కు రూ.24,500 జీతంఅమలు చెయ్యాలి.10 ఏళ్లు సర్వీసు పూర్తయిన ఇంజనీరింగ్ మునిసిపల్ కార్మికులను రెగ్యులైజ్ చెయ్యాలి.
