సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఉత్తరాది నుండి వర్షపు నీరు పెరుగుతుండటంతో ఏపీలోని గోదావరి జిల్లాల మధ్య ప్రవహించే గోదావరి నదికి వరద నీరు పెరుగుతున్న నేపథ్యంలో అల్లూరి జిల్లా దేవీపట్నం మండలంలో పోశమ్మ గండి బోట్ పాయింట్ నుంచి పాపికొండలు విహార యాత్రకు వెళ్లే పర్యాటక బోట్లను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. గత విషాద ఘటనలు దృష్టిలో పెట్టుకొని గోదావరి నీటిమట్టం పెరుగుతున్న కారణంగా ముందుస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నామని, రిజర్వేషన్ టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసారు. త్వరలో తదుపరి తేదీని ప్రకటిస్తారు. పాపికొండలు పేరంటాలపల్లి విహారయాత్ర కూడా తాత్కాలికంగా నిలిపివేశారు.
