సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టోపియా గ్లోబల్- ఏపీ పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సు విజయవాడలో ఈరోజు ఉదయం 11 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు. ఈ సదస్సును ఇన్వెస్ట్ ఇండియా మరియు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా నిర్వహిస్తుంది. భారత్-యూఏఈ ఆర్థిక సంబంధాలు బలోపేతంపై ప్రధానంగా పెట్టుబడులకు ముఖ ద్వారంగా రాష్ట్రం అనే అంశంపై మొదట చర్చ జరగనుంది. ఈ సదస్సులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన వివిధ ప్రముఖ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు,యూఏఈ మంత్రులు, సీఎండీలు, సీఈఓలు సుమారు 200 మంది హాజరు అవుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలు, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన అంశాలపై ముఖ్యంగా చర్చించే అవకాశం ఉంది.
