సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజాగా అంతర్జాతీయ శాంతి, భద్రతల అంశంపై ఐరాస భద్రతా మండలిలో ఉన్నతస్థాయి చర్చ జరిగింది. ఇందులో పాకిస్తాన్ మళ్ళీ కాశ్మీర్ అంశాన్ని అక్కడ చర్చించింది. కాశ్మిర్ భారత్ లో భాగం కాదని అది వివాదాస్పద భూభాగమని ప్రపంచం మొత్తానికి తెలుసునంటూ పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కుటిల బుద్ధి తో వాదించారు. దాంతో పాటూ సింధుజలాల ఒప్పందం గురించి కూడా మాట్లాడారు. దీనికి అక్కడే భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ పాక్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ఐక్యరాజ్యసమితిలో ఇండియా వ్యవస్థాపక సభ్యదేశం. తాము ఎప్పుడు బాధ్యతాయుతంగా ఉంటామని.. అన్ని దేశాలతో శాంతి, శ్రేయస్సు కోసం పాటు పడతామని చెప్పారు. భారత్ అన్ని రకాలుగా సమర్ధవంతంగా పని చేస్తూ ప్రపంచంలో బలమైన ఆర్ధిక వ్యవస్థగా ముందుకు దూసుకొని పోతుంటే . కానీ పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదానికి ఊతమిస్తూ ఉన్మాదంలో కూరుకుపోతోందని , ఐఎంఎఫ్‌ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పులు అడుక్కోవడంలో ఆ దేశం బిజీగా ఉందంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని గుర్తించి, ప్రోత్సహించే పాకిస్తాన్ ఇక్కడ నీతిసూత్రాలు వల్లించడం హాస్యాస్పదమన్నారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్ లో భారత్ తాము అనుకున్న పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాల లక్ష్యాలపై అటాక్ చేశాక…పాక్ అభ్యర్ధనతో కాల్పుల విరమణ చేశామని…ఇందులో ఎవరి మధ్యవర్తిత్వం లేదని ( అమెరికా పాత్ర లేదని పరోక్షంగా ) నొక్కి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *