సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలంలో తెలుగు సినిమా పరిశ్రమకు మంచి హిట్స్ పడుతున్నాయి. లిట్టిల్ హార్ట్స్ వంటి 2 కోట్లతో నిర్మించిన సినిమా ఆడుతూ పాడుతూ 40 కోట్లు కలెక్షన్ వసూళ్లు సాధించడం అందరిని నివ్వెర పరచింది. ఇక అర్జున్ సజ్జా హీరోగా మిరాయి వంటి సినిమా అద్భుతమైన గ్రాఫిక్స్ తో కేవలం 60 కోట్ల తో నిర్మిస్తే ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సాధారణ టికెట్స్ రేట్లపై 170 కోట్ల కలెక్షన్స్ దిశగా 4వ వారం రన్నింగ్ కొనసాగిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ నటించిన O G సినిమా ‘టైమ్స్ అఫ్ ఇండియా’ రిపోర్ట్ ప్రకారం.. 11 రోజులకు 200 కోట్లు పైగా కలెక్షన్స్ వసూళ్లు చేసినట్లు ప్రకటించింది. ( అయితే O G మేకర్స్ 276 కోట్లు అంటున్నారు) ..రిషబ్ శెట్టి హీరోగా కాంతారా చాప్టర్ 1 సినిమా ప్రభంజనం పాన్ ఇండియా స్థాయిలో మాములుగా లేదు. కేవలం 4 రోజులకే 223 కోట్లు సాధించినట్లు టైమ్స్ అఫ్ ప్రకటించింది. ఇదే సినిమా తెలుగు రాష్ట్రాలలో 4 రోజులకే 34 కోట్లు సాధించడం విశేషం. ( ఈ డబ్బింగ్ సినిమాకు కూడా ఏపీలో టికెట్స్ రేట్లు పెంచుకొనే అవకాశం ప్రభుత్వం ఇచ్చింది) .. ఇదిలా ఉండగా భీమవరంలో టౌన్ మొత్తంపై ఈ సినిమాల గ్రాస్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. ఇప్పటి వరకు OG సినిమా 11 రోజులకు 1కోటి 64 లక్షలు వసూళ్లు సాధించగా( ప్రీమియర్ కలెక్షన్స్ కలపి), మిరాయి సాధారణ టికెట్స్ రేట్లపై 24 రోజులకు 44 లక్షలు సాధించింది. ఇక కాంతారా 4 రోజులకు 35 లక్షలు వసూళ్లు సాధించి ( టికెట్ రేట్లు పంచడం వల్ల )తన జోష్ కొనసాగిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *